హైదరాబాద్, ఆట ప్రతినిధి : బొడిగె బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ జరుగనుంది. చర్లపల్లిలోని ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్ వేదికగా పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో జరుగనున్న టోర్నీ ప్రైజ్మనీ 60వేలుగా నిర్వాహకులు ప్రకటించారు. టోర్నీలోపోటీపడాలనుకునే వారు ఈ నంబర్లలో 7337578899, 7337399299 సంప్రదించవచ్చని తెలిపారు.