లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లతో కూడిన టీమ్ ఎమ్‌జీడీ1 ఐదో స్థానంలో నిలిచింది. ఇదే టోర్నీలో ర్యాపిడ్ టైటిల్ సొంతం చేసుకున్న టీమ్ ఎమ్‌జీడీ1.. బ్లిట్జ్ విభాగంలో ఒకింత నిరాశపరిచింది. సోమవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన నాకౌట్ పోరులో టీమ్ ఎమ్‌జీడీ1.. 1-3 తేడాతో హెక్సామైండ్ చెస్ టీమ్ చేతిలో ఓటమిపాలైంది.
ఇరిగేసి అర్జున్, పెంటెల హరికృష్ణ, డేవిడ్ గుజారో, ప్రణవ్, లియోన్ లూక్ మెండోకా, స్టావ్రోలా, అథర్వ తైదేతో కూడిన టీమ్ ఎమ్‌జీడీ1.. లెవనో అరోనియన్, విదిత్ గుజరాతి లాంటి ప్లేయర్లను హెక్సామైండ్ కల్గి ఉన్నది. అయితే ఉత్కంఠగా సాగిన పోరులో హెక్సామైండ్ ప్లేయర్ అనీశ్ గిరి చేతిలో హరికృష్ణ ఓడిపోయాడు. దీంతో ఐదో స్థానం కోసం ప్లేఆఫ్స్ పోరులో టీమ్ ఎమ్‌జీడీ1…4-2తో విశ్వనాథన్ ఆనంద్‌కు చెందిన ఫ్రీడమ్ టీమ్‌పై గెలిచింది. రానున్న భవిష్యత్‌లో చెస్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఇలాంటి టోర్నీలు నిర్వహిస్తామని ప్రపంచ చెస్ ఫెడరేషన్(ఫిడే) ఉపాధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నాడు.