ODI World Cup | రోహిత్శర్మ సెంచరీ.. ఆఫ్ఘనిస్తాన్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
ODI World Cup | ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 15 ఓవర్లు మిగిలి ఉండగానే 273 పరుగులతో విజయం సాధించింది.
ODI World Cup | ఆఫ్ఘన్ విధించిన 273 పరుగుల విజయ లక్ష్యాన్ని 15 ఓవర్ల ముందే భారత్ చేదించింది. తొలుత లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. సారధి రోహిత్ శర్మ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ పెంచడంపై ద్రుష్టి పెట్టారు. 63 బంతుల్లోనే రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకోగా, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయి పెవిలియన్ బాట పట్టాడు.
భారత్, ఆప్ఘనిస్థాన్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ముందు ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. తొలుత భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. పొదుపుగా పరుగులు ఇచ్చినా.. తర్వాతర్వాత ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, స్టాండ్స్ వైపు మళ్లిస్తూ.. సింగిల్స్ తీస్తూ స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్ సారధి హస్మతుల్లా షాహిద్.. అజ్మతుల్లా ఒమర్ జాయితో కలిసి నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు జత చేశారు. 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటైనా హజ్మతుల్లా షాహిద్ పర్వాలేదనిపించారు.
మరో నాలుగు పరుగుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాల్సిన ఇషాన్ కిషాన్.. 19వ ఓవర్ లో రషీద్ ఖాన్ వేసిన నాలుగో బంతిని ఆడి ఇబ్రహీం జద్రాన్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీం ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి వికెట్ భాగస్వామ్యానికి 156 పరుగులు జత చేశారు. ఔటయ్యే సమయానికి ఇషాన్ కిషన్ వ్యక్తిగత స్కోర్ 47.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

