Manika Batra ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల ఆరంభానికి ముందే భారత్‌కు బిగ్ షాక్. పలు పోటీల్లో పతకాలు గెలిచిన టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా (Manika Batra) అనూహ్యంగా 20వ ఆసియా క్రీడలకు దూరమైంది. మహిళల విభాగంలో ఫేవరెటైన మనికా నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అందుకోలేదు. దాంతో, భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (TTFI) ఆమెను స్క్వాడ్ నుంచి తప్పించింది.
ఆసియా క్రీడల్లో పతకం కొల్లగొట్టాలనుకున్న మనికా బత్రా ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవల కాలంలో దేశవాళీ పోటీలకు డుమ్మా కొట్టడంతో ఫలితంగా ఆమెకు టీటీఎఫ్ఐ ర్యాంకింగ్స్ రాలేదు. కాబట్టి.. ఆసియా క్రీడల స్క్వాడ్ నుంచి మనికను తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Manika Batra has been named among the reserves for India’s table tennis squad for the 2026 Asian Games after not meeting the selection criteria set by the Table Tennis Federation of India.
👉 Take a look at India’s table tennis squad for the 2026 Asian Games.
🏓 The table… pic.twitter.com/YRYXHjyOPG
— Sportstar (@sportstarweb) June 18, 2026
ఈ టోర్నీలో స్వస్తికా ఘోష్‌తో పాటు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది మనికా. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఆమె టోర్నీకి దూరమైంది. మనిక గైర్హాజరీలో భారత బృందానికి శ్రీజ నాయకత్వం వహించనుంది. జపాన్ వేదికగా 20వ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకూ జరుగనున్నాయి.