Shadab khan: టీ 20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన పాక్ బౌలర్‌గా షాదాబ్ ఖాన్ రికార్డ్
టీ 20 ఫార్మాట్లో పాక్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన షాహిద్ ఆఫ్రీది రికార్డు బ్రేక్
పొట్టి ప్రపంచకప్‌లో బంతితో, బ్యాటుతో అద్భుతప్రదర్శన చేసిన పాక్ లెగ్‌స్పిన్నర్ షాదాబ్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ లెగ్ స్పిన్నర్ పొట్టి క్రికెట్ ఫార్మాట్లో అత్యధికంగా 98 వికెట్లు పడగొట్టిన పాకిస్థాన్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో హ్యారీ బ్రూక్ వికెట్ పడగొట్టడంతో ఈ ఘనత సాధించాడు.
ఇప్పటివరకూ పాకిస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీది పేరిట ఉంది. ఆఫ్రీది 98 మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై రెండు వికెట్లు తీసిన షాదాబ్ 97 వికెట్లతో షాహిద్ ఆఫ్రీది రికార్డుని సమం చేశాడు. ఈ లెగ్‌స్పిన్నర్ 82 మ్యాచుల్లోనే 97 వికెట్లు పడగొట్టాడు.ఫైనల్లో బ్రూక్ వికెట్ పడకొట్టి ఆఫ్రీది రికార్డుని బ్రేక్ చేశాడు. తలా 85 వికెట్లతో ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

