సిన్సినాటి : యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు సన్నాహకంగా జరుగుతున్న సిన్సినాటి టోర్నీలో జాస్మిన్ పౌలోని ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో పౌలోని 6-3, 6-7(2-7), 6-3తో వెరోనికా కుదుర్మెతోవాపై అద్భుత విజయం సాధించింది.
దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన పోరులో పౌలోని అద్భుత పోరాట పటిమ కనబరిచింది. ఫైనల్లో ఇగా స్వియాటెక్‌తో పౌలోని తలపడనుంది.