దుబాయ్: పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో 360 డిగ్రీస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఐసీసీ జట్టుకు ఎంపికవడం ఇది వరుసగా రెండోసారి.
సూర్యకుమార్‌తో పాటు టీమ్ఇండియా నుంచి యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్లో చోటు దక్కించుకున్నారు. ఏడాది కాలంగా నమోదైన వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఈ జట్టును ఎంపిక చేసింది.