Suryakumar Yadav : భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆటకు దూరమై రెండు నెలలు కావొస్తోంది. జూన్‌లో ‘స్పోర్ట్స్ హెర్నియా’ (Sports Hernia) సర్జరీ అనంతరం కోలుకుంటున్న సూర్య ఆసియా కప్(Asia Cup 2025)పై దృష్టి సారించాడు. మెగా టోర్నీకి నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో త్వరగా కోలుకునేందుకు సిద్ధమవుతున్నాడు. బెంగళూరులోని ఎన్సీఏ లేదా.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కొన్నిరోజులు రిహాబిలిటేషన్‌లో ఉండనున్నాడు. తాను ఫిట్నెస్ సాధించడం కోసం ఎన్సీఏలో పునరావాసం కల్పించాలని అతడు ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలికి తెలియజేశాడు సూర్య.
పొట్టి క్రికెట్ సంచనలంగా పేరొందిన సూర్య.. నిరుడు పొట్టి ప్రపంచ కప్ తర్వాత కొత్త సారథిగా బాధ్యతులు చేపట్టాడు. శ్రీలంక పర్యటనలో జట్టును విజయ పథాన నడిపిన ఈ ముంబైకర్.. అనూహ్యంగా గాయపడ్డాడు. దాంతో, స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ అనివార్యం కాగా.. జర్మనీకి వెళ్లాడు. మూడేళ్లలో అతడు ఈ అపరేషన్ చేయించుకోవడం ఇది మూడోసారి.
సెప్టెంబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ షురూ కానుంది. ఆలోపే సూర్య కోలుకొని ఫిట్నెస్ సాధిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9 వ తేదీ నుంచి 28 వరకూ జరిగే ఈ మెగా టోర్నీ జరుగనుంది. భారత జట్టు 15వ తేదీన పాకిస్థాన్‌ను ఢీకొననుంది. ‘పొత్తికడుపు కుడివైపు భాగంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ విజయవంతమైంది. ఆపరేషన్ ముగిశాక నేను కోలుకొనే దశలో ఉన్నాననే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మళ్లీ మైదానంలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని ఆస్ప్రతి బెడ్ మీద విజయం సంకేతం చూపిస్తూ జూన్ 26న సూర్య సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.
Post surgery, Suryakumar checks into NCA ahead of Asia Cup Suryakumar Yadav is currently at the National Cricket Academy – or rather, the Centre of Excellence (CoE) – as he aims to be fit in time for the Asia Cup.https://t.co/7Wm3X0Tlrs #MohammedSiraj #Kohli #Mainoo pic.twitter.com/CmNZhj6FbW
— SPORTS WIZ (@mysportswiz) August 4, 2025