Sunil Gavaskar | వారిపై రెండేళ్ల నిషేధం సరిపోదు.. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.!
Sunil Gavaskar : ఆఖరి నిమిషంలో క్రికెటర్లు 'మేము వైదొలుగుతన్నాం' అని చెప్పడాన్ని ఇక ఏమాత్రం తేలికగా తీసుకోవవద్దని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అంటున్నాడు.
Sunil Gavaskar : ఐపీఎల్ ఆరంభానికి ముందు కొందరు విదేశీ ఆటగాళ్లు ప్లేట్ ఫిరాయించడం పరిపాటి అయింది. నిరుడు హ్యారీ బ్రూక్(Harry Brook), ఇప్పుడేమే బెన్ డకెట్(Ben Duckett).. ఇద్దరూ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆఖరి నిమిషంలో హ్యాండిచ్చారు. జట్టు కూర్పు దాదాపు ఖరారైన సమయంలో క్రికెటర్లు ‘మేము వైదొలుగుతన్నాం’ అని చెప్పడాన్ని ఇక ఏమాత్రం తేలికగా తీసుకోవవద్దని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అంటున్నాడు. ఆఖరి నిమిషంలో ఏదో సాకు చూపి మేము ఆడలేము అంటూ కూల్‌గా హ్యాండిచ్చే విదేశీ క్రికెటర్లపై రెండేళ్ల నిషేధం సరిపోదని, మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సన్నీ డిమాండ్ చేస్తున్నాడు.
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఏదో కారణంతో వైదొలిగే ఆటగాళ్లకు తగిన బుద్ది చెప్పాలని గవాస్కర్ అభిప్రాయ పడుతున్నాడు. ప్రస్తుతం అమలులో ఉన్న శిక్ష వ్యవస్థను సమీక్షించాలని బీసీసీఐకి అతడు సూచించాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడైన ఆటగాళ్లు ఆఖరి నిమిషంలో వైదొలిగితే వారిపై రెండేళ్ల నిషేధం విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని గవాస్కర్ డిమాండ్ చేశాడు. మరొకరు ఇలాంటి పొరపాటు చేయకుండా చూసేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపాడు.
“Two-year ban isn’t enough” 👀
Sunil Gavaskar calls on the BCCI to tighten rules after fresh #IPL pullouts, says current punishments lack real impact 🔥#IPL2026https://t.co/Sxyrazyqgd
— IndiaToday (@IndiaToday) March 29, 2026
‘యాషెస్ సిరీస్‌లో బెన్ డకెట్ బాగా ఆడాడు. ది హండ్రెడ్ వేలంలో అతడికి ఆశించినంత ధర దక్కలేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ, అతడిక మంచి ధర వచ్చింది. అప్పుడు అతడు దేశం తరఫున ఆడడంపై దృష్టి సారించాలని ఫ్రాంచైజీకి చెప్పి ఉండాల్సింది. కానీ, మనోడు అలా చేయలేదు. ఇప్పుడు ఐపీఎల్ ఆడేందుకు దేశం కోసం ఆడాలని ఉందనే సాకు చూపించాడు. కాబట్టి.. ప్రస్తుతం అములో ఉన్న రెండేళ్ల నిషేధం పెద్దగా ఫలితమివ్వడం లేదు. అందుకని ఆటగాళ్లపై ప్రభావం పడేలా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే వారు రెండేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతూనే ఉంటారు’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.

నిరుడు మినీ వేలంలో బెన్ డకెట్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఈ విధ్వంసక ఓపెనర్ ఈసారి తమ బ్యాటింగ్ అస్త్రం అవుతాడని ఢిల్లీ యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, అతడు మాత్రం ‘నాకు ఇంగ్లండ్‌కు ఆడాలని ఉంది. వేసవి సిరీస్ కోసం తాను మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే ఐపీఎల్ నుంచి వైదొలగాలనే కష్టమైన నిర్ణయం తీసుకున్నా. నన్ను క్షమించండి’ అని పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

