న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్.. టాంపెర్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న చాలెంజర్ లెవల్ టోర్నీ సెమీఫైనల్లో 25 ఏండ్ల నాగల్ 4-6, 6-3, 6-2తో డానియల్ రిన్కాన్పై విజయం సాధించాడు.
నాగల్కు ఇది ఐదో చాలెంజర్ లెవల్ ఫైనల్ కాగా.. ఈ ఏడాది రెండోది. ఏప్రిల్లో రోమ్ వేదికగా జరిగిన గార్డెన్ ఓపెన్లో నాగల్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.