పెరుగియ: భారత యువ టెన్నిస్ సంచలనం సుమిత్ నాగల్ వరుస విజయాలతో పెరుగియ చాలెంజర్ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. ఇటలీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో నాగల్ 6-4, 7-5తో అన్‌సీడెడ్ పోలండ్ ఆటగాడు మక్స్ కస్నికోవ్స్కిని వరుస సెట్లలో ఓడించాడు.