బెంగళూరు: బెంగళూరు ఓపెన్‌లో భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో నాగల్ 6-2, 7-5తో కోల్మన్ వాంగ్(హాంకాంగ్)పై అద్భుత విజయం సాధించాడు. గంటా 46నిమిషాల పాటు సాగిన పోరులో నాగల్ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు.
తొలి సెట్లో 2-0 ఆధిక్యం కనబరిచిన నాగల్‌కు మరుసటి గేమ్‌లో వాంగ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే ఎనిమిదో గేమ్‌లో బ్రేక్ సాధించిన ఈ యువ ప్లేయర్ తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్లో వరుసగా నాలుగు గేమ్స్ దక్కించుకున్న నాగల్‌కు వాంగ్ పోటీనిచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.