జొహొర్ (మలేషియా) : ప్రతిష్టాత్మక సుల్తాన్ జొహొర్ హాకీ కప్‌లో భారత జూనియర్ హాకీ జట్టు ఫైనల్స్‌కు ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో భారత్.. 2-1తో ఆతిథ్య మలేషియాను ఓడించి ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 8వ సారి ఫైనల్ చేరింది.
12వ సారి ఈ టోర్నీలో ఆడుతున్న భారత్ 8 సార్లు ఫైనల్‌కు అర్హత సాధించడం గమనార్హం. మ్యాచ్‌లో భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (22వ నిమిషంలో), ఆనంద్ కుశ్వాహ (48వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచారు. మలేషియా నుంచి నవినేష్ (43వ ని.) ఏకైక గోల్ కొట్టాడు.