T20 World Cup 2026 | విధ్వంసక హిట్టర్‌కు షాకిచ్చిన సెలెక్టర్లు.. 19 ఏళ్ల కుర్రాడికి ప్రపంచకప్ బెర్త్..!
T20 World Cup 2026 : రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తడబడిన దక్షిణాఫ్రికా (South Africa) ఈసారి టైటిల్ లక్ష్యంగా కదులుతోంది. ఈ మెగాటోర్నీకి సమయం సమీపిస్తున్నందున శుక్రవారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. ఎడెన్ మర్క్రమ్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు.
T20 World Cup 2026 : రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తడబడిన దక్షిణాఫ్రికా (South Africa) ఈసారి టైటిల్ లక్ష్యంగా కదులుతోంది. ఈ మెగాటోర్నీకి సమయం సమీపిస్తున్నందున శుక్రవారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. ఎడెన్ మర్క్రమ్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. అనూహ్యంగా యువ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్(Triston Stubbs)ను పక్కన పెట్టేశారు. ఇటీవల వికెట్ల వేటతో అదరగొడుతున్న 19 ఏళ్ల పేసర్ క్వెనా మఫాకాను మెగా ఈవెంట్‌కు ఎంపిక చేశారు.
ఐసీసీ పురుషులు టీ20 ప్రపంచకప్ కోసం సీనియర్లు, జూనియర్లతో కూడిన దుర్బేధ్యమైన బృందాన్ని సఫారీ సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయం కారణంగా భారత పర్యటనలో ఆడని పేసర్ కగిసో రబడను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. దేశవాళీ టీ20 లీగ్, ఎస్ఏ20లో మెరిసిన జేసన్ స్మిత్, అండర్ -19 ప్రపంచకప్‌లో మెరిసిన యువ పేసర్ క్వెనా మఫాకాకు తొలిసారి వరల్డ్‌కప్ బెర్తు లభించింది.
🚨 SQUAD ANNOUNCEMENT 🚨
The South African Men’s selection panel has announced the 15-player squad for the ICC Men’s T20 World Cup 2026, to be held in India and Sri Lanka from 07 February – 08 March.
T20 International (T20I) captain Aiden Markram will lead the side, which… pic.twitter.com/EqZvYPpCga
— Proteas Men (@ProteasMenCSA) January 2, 2026
అయితే.. ఐపీఎల్లో విధ్వంసక హిట్టర్‌గా అవతరించిన స్టబ్స్‌కు, భారత్‌పై వన్డే సిరీస్‌లో దంచేసిన రీజా హెండ్రిక్స్‌కు మాత్రం స్క్వాడ్‌లో చోటు దక్కలేదు. ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక వేదికగా ప్రారంభం కానుంది. ఇటీవలే టీమిండియా చేతిలో వైట్‌బాల్ సిరీస్ కోల్పోయిన సఫారీ టీమ్ ఈసారి వరల్డ్ కప్ లక్ష్యంగా రానుంది.
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), క్వింటన్ డికాక్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, టోనీ డి జోర్జి, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎంగిడి, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, అన్రిజ్ నోర్జి, క్వెనా మఫాకా, జేసన్ స్మిత్.
‘పొట్టి వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపికకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్రూప్ భారత్, శ్రీలంకలో విజయవంతమవుతుందని నమ్మకముంది. అనుభవజ్ఞులు, ప్రతిభావంతులతో కూడిన ప్రపంచస్థాయి, అత్యుత్తమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశాం’ అని కన్వీనర్ సెలెక్టర్ పాట్రిక్ మొరొనే తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

