సిడ్నీ: స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్(Lakshya Sen).. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచంలోని ఆరో నెంబర్ ర్యాంకర్ చౌ తెన్ చెన్ను సేన్ ఓడించాడు. చైనీస్ తైపికి చెందిన అతన్ని 17-21, 24-22, 21-16 స్కోరుతో మట్టికరిపించాడు. 86 నిమిషాల పాటు ఆ సెమీఫైనల్ హోరాహోరీగా సాగింది. ఈ ఏడాది హాంగ్ కాంగ్ ఓపెన్ ఫైనల్లోకి కూడా లక్ష్యసేన్ ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఇంకా అతను టైటిల్ నెగ్గాల్సి ఉన్నది. ఆదివారం జరిగే ఫైనల్లో యుషి తనకా లేదా లిన్ చున్ యితో తలపడే అవకాశం ఉన్నది.
2021 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన లక్ష్యసేన్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో తొలి గేమ్ కోల్పోయాడు. అయితే ఆ తర్వాత అతను గట్టిగా పోటీ ఇచ్చాడు. వరుసగా చివరి రెండు గేమ్‌లను గెలుచుకున్నాడు. ఓ గేమ్‌లో ఇద్దరు 44 షాట్ ర్యాలీ ఆడారు. నెట్ షాట్స్, ష్మాష్లతో లక్ష్యసేన్ ఆకట్టుకున్నాడు.
What A Save By Lakshya Sen ❤️💥
📸 : BWF YT#AustraliaOpen2025 https://t.co/WPyZhBVFY6 pic.twitter.com/G1IHuXGtuC
— Badminton Media (@BadmintonMedia1) November 22, 2025