హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటిన దండు శ్రీవిజ్ఞారెడ్డి.. జాతీయ పోటీలకు ఎంపికైంది. రోలర్ స్కేటింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో చెన్నై వేదికగా నిర్వహించిన పోటీల్లో శ్రీవిజ్ఞారెడ్డి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనుంది. హైదరాబాద్, భువనగిరిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో శ్రీవిజ్ఞారెడ్డి ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించింది. ప్రస్తుతం సీబీఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్న శ్రీవిజ్ఞారెడ్డి.. జాతీయ స్థాయిలోనూ సత్తాచాటి రాష్ర్టానికి మంచి పేరు తీసుకొస్తానని పేర్కొంది.