హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి 5-0 తేడాతో తిద్దిమ్రోడ్ అథ్లెటిక్స్ యూనియన్‌పై భారీ విజయం సాధించింది.
పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో శ్రీనిధి తరఫున గురుముఖ్‌సింగ్, జగ్దీప్సింగ్, లాల్రోమా, డేవిడ్ కాస్టెండా గోల్స్ చేశారు. తమ తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 23న రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీతో శ్రీనిధి తలపడుతుంది.