మంజేరి : సూపర్ కప్లో శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో శ్రీనిధి 0-1 తేడాతో రౌండ్గ్లాస్ పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఆడిన మూడు మ్యాచ్ల్లో శ్రీనిధి(4) ఒక విజయం, డ్రా, ఓటమితో బెంగళూరు ఎఫ్సీ(5) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో రౌండ్గ్లాస్ తరఫున వాల్పియా (41ని) ఏకైక గోల్ చేశాడు.