శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా టీ20 క్రికెట్‌కు మలింగ వీడ్కోలు పలికాడు. దీంతో మలింగ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్టు అయింది. 2014లో శ్రీలంక వరల్డ్ కప్ గెలుచుకోవడంలో మలింక ముఖ్య పాత్ర పోషించాడు. అప్పుడు శ్రీలంక జట్టుకు మలింగ కెప్టెన్‌గా ఉన్నాడు.
ఈ సీనియర్ బౌలర్.. తన రిటైర్మెంట్ గురించి తాజాగా ట్వీట్ చేశాడు. టీ20 క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నా. ఇక అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. నా ఈ జర్నీలో నాకు సహకరించిన, మద్దతు పలికిన అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో క్రికెట్లో రాణించే యువ క్రికెటర్లతో నా అనుభవాన్ని షేర్ చేయడం కోసం ఇక నా సమయాన్ని కేటాయిస్తా.. అంటూ మలింగ ట్వీట్ చేశాడు. అలాగే.. తన కెరీర్లో బెస్ట్ అయిన కొన్ని మ్యాచ్‌ల క్లిప్పింగ్స్‌తో యూట్యూబ్‌లో మలింగ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. మలింగ క్రికెట్ రిటైర్మెంట్పై ఐసీసీ కూడా ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.
మలింగ.. 2011లోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019 లో వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గత జనవరిలో ఫ్రాంచైజ్ క్రికెట్‌ను వీడాడు.
శ్రీలంక క్రికెట్ బోర్డ్‌తో పాటు ముంబై ఇండియన్స్, మెల్బోర్న్ స్టార్స్, కెంట్ క్రికెట్, రంగ్‌పూర్ రైడర్స్, గుయానా అమెజాన్ వారియర్స్, మరాఠా అరేబియన్స్, మాన్ట్రియల్ టైగర్స్‌కు ఈ సందర్భంగా మలింగ ధన్యవాదాలు తెలిపాడు.
Hanging up my #T20 shoes and #retiring from all forms of cricket! Thankful to all those who supported me in my journey, and looking forward to sharing my experience with young cricketers in the years to come.https://t.co/JgGWhETRwm #LasithMalinga #Ninety9
— Lasith Malinga (@ninety9sl) September 14, 2021
2004లో మలింగ.. తొలిసారి ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టెస్ట్ మ్యాచ్ ఆడిన 16 రోజుల తర్వాత వన్డే క్రికెట్లో తన తొలి మ్యాచ్‌ను ఆడాడు. 2006 జూన్‌లో టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 107 వికెట్లు తీశాడు మలింగ. అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలలో రెండు సార్లు.. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు మలింగ.
"Today I decided I want to give 100% rest to my T20 bowling shoes."
— ICC (@ICC) September 14, 2021
Lasith Malinga has called time on his playing career 🌟