Sri Lanka Vs Afghanistan | పల్లెకెలె: బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్‌ను చిత్తుచేసింది. మొదట లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 308 రన్స్ చేసింది.
చరిత అసలంక (97 నాటౌట్), కుషాల్ మెండిస్ (61), సదీర (52), జనిత్ (50) రాణించారు. అనంతరం అఫ్గాన్ 33.5 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (54), రహ్మత్ షా (63) మాత్రమే ఆకట్టుకున్నారు.