SRH vs RCB | టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. ఆర్సీబీపై బదులు తీర్చుకునేనా..!
SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో కంగుతిన్న హైదరాబాద్ ఈసారి ప్రతీకార విజయంతో లీగ్ దశను ముగించాలనే కసితో ఉంది.
SRH vs RCB : పంతొమ్మిదో సీజన్లో క్వాలిఫయర్ 1 ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) భారీ విజయంపై కన్నేసింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను ఓడిస్తే ఆరెంజ్ ఆర్మీ కల నెరవేరినట్టే. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో కంగుతిన్న హైదరాబాద్ ఈసారి ప్రతీకార విజయంతో లీగ్ దశను ముగించాలనే కసితో ఉంది. హై ఓల్టోజ్ మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీ సంఖ్యలో వెళ్లారు.
ఈ సీజన్లో పవర్ ప్లేలోనే వికెట్ల వేటతో ఆర్సీబీ విజయాల్లో కీలకమవుతున్న భువనేశ్వర్, హేజిల్‌వుడ్ ద్వయం నుంచి సన్‌రైజర్స్ హిట్టర్లకు ముంపు పొంచి ఉంది. అయితే.. సొంత గడ్డపై టాప్ గేర్‌లో ఆడే కమిన్స్ సేన మరోసారి గర్జించిందంటే బెంగళూరు జట్టుకు ఓటమి తప్పదు.
Playoffs berth secured ✅
Now its race for Top 2 🏁Who are you backing tonight? 🧐#TATAIPL | #KhelBindaas | #SRHvRCB pic.twitter.com/By9ljjvsw4
— IndianPremierLeague (@IPL) May 22, 2026
క్వాలియర్ 1 ఆడేందుకు సన్‌రైజర్స్ జట్టు 220 కొట్టి.. ఆర్సీబీని 86 పరుగుల తేడాతో ఓడించాలి. రెండొందలు కొడితే 87 రన్స్ తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ ఛేదనకు దిగితే 150 పరుగుల లక్ష్యాన్ని 11.1 లేదా 11.3 ఓవర్లలోనే పూర్తి చేయాలి. అప్పుడే గుజరాత్ టైటాన్స్ నెట్ రన్‌రేటును దాటి ఎస్ఆర్హెచ్ ముందంజ వేయగలదు.
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ దార్ సలాం.
ఇంప్యాక్ట్ సబ్స్ – టిమ్ డేవిడ్, కనిష్క్ చౌహన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, జోర్డాన్ కాక్స్.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీశ్ రెడ్డి, కమిన్స్(కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రఫుల్ హింగే, అనికేత్ వర్మ, లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

