Sunrisers Hyderabad : పంతొమ్మిదో సీజన్లో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్‌లోకి యువకెరటం వచ్చేశాడు. అండర్-19 వరల్డ్‌కప్ హీరో ఆర్ఎస్ అంబ్రిష్(RS Ambrish) ఆరెంజ్ ఆర్మీతో కలిశాడు. గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమించిన శివం మావి (Shivam Mavi) స్థానంలో అంబ్రిష్‌ను సన్‌రైజర్స్ తీసుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.18 ఏళ్ల అంబ్రిష్ ఐపీఎల్లో అదిరిపోయేలా అరంగేట్రం చేయాలనుకుంటున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్‌లో యువపేసర్ అంబ్రిష్ చేరాడు. పేస్ ఆల్‌రౌండరైన ఈ కుర్రాడిది తమిళనాడు. అండర్ -16లో గొప్పగా రాణించిన అంబ్రిష్ ఈమధ్యే ముగిసిన అండర్-19 వరల్డ్‌కప్‌లో వికెట్ల వేటతో అదరగొట్టాడు. మొత్తంగా 11 వికెట్లతో టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడీ కుర్రాడు. బంతితో నిప్పులు చెరిగే అంబ్రిష్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కూడా. దాంతో, అటు బౌలర్‌గా, ఇటు లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గానూ పనికొస్తాడని సన్‌రైజర్స్ అతడిని స్క్వాడ్‌లో చేర్చుకుంది.
🚨 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋 𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓
RS Ambrish, the ICC Under-19 Cricket World Cup 2026 winner, joins our squad as Shivam Mavi’s replacement.
Go well, Ambrish 🧡 pic.twitter.com/nherHX6l3N
— SunRisers Hyderabad (@SunRisers) May 1, 2026
ఇప్పటికే పంతొమ్మిదో సీజన్లో అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు అంబ్రిష్ సైతం అరంగేట్రం చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇరుకున పెట్టాలని తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. మే 3న కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కమిన్స్ సేన ఢీకొట్టనుంది.
🚨 Player Replacement 🚨@SunRisers sign RS Ambrish as injury replacement for Shivam Mavi.
Details 🔽 | #TATAIPL | #KhelBindaas https://t.co/oc3VctsTN5
— IndianPremierLeague (@IPL) May 1, 2026