Pat Cummins : పంతొమ్మిదో సీజన్లో రెండో విజయంలో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH). బ్యాటర్లే కాదు మేమూ జట్టును గెలిపించగలమని అరంగేట్రం మ్యాచ్‌లోనే కుర్రాళ్లు నిరూపించడంతో జోరు మీదున్న ఆరెంజ్ ఆర్మీకి మరో గుడ్‌న్యూస్. మాజీ కెప్టెన్, వెటరన్ పేసర్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) త్వరలోనే స్క్వాడ్‌తో కలువనున్నాడు. ఫిట్నెస్ పరీక్షల అనంతరం నేరుగా భారత్‌కు వచ్చేయనున్నాడు ప్యాటీ.
ఐపీఎల్ కోసం మార్చి 27న భారత్‌కు వచ్చేసిన కమిన్స్ అనుకోకుండా టోర్నీ మధ్యలోనే స్వదేశం వెళ్లాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్న ప్యాటీ.. బుధవారం ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కానున్నాడు. ఒకవేళ ఫిట్నెస్ టెస్టులో గట్టెక్కితే అతడు మళ్లీ స్క్వాడ్‌లో చేరతాడాని సన్‌రైజర్స్ యాజమాన్యం ఆశలు పెట్టుకుంది.
🚨Cricbuzz understands that Pat Cummins will undergo a fitness test tomorrow in Australia and fly to India on April 17
If all goes well, he could be back playing again soon for SRH pic.twitter.com/LIXc55Upjj
— Cricbuzz (@cricbuzz) April 14, 2026
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 17వ తేదీన కమిన్స్ హైదరాబాద్‌కు వస్తాడని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. మరుసటి రోజు ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ఈ వెటరన్ పేసర్ అందుబాటులో ఉండే అవకాశముంది. కుర్రాళ్లు ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌లకు తోడు కమిన్స్ మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థులకు ఇక హడలే.
అయితే.. ఐపీఎల్‌కు అనుమతిస్తే.. పని ఒత్తిడి కారణంగా ఫాస్ట్ బౌలర్లు గాయడపడతారనే భయంతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి క్రికెట్ ఆస్ట్రేలియా తెగ ఆలోచిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాల్సిన ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్‌కు ఇంకా ఎన్వోసీ ఇవ్వలేదు. యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు అనుమతిచ్చినా.. బౌలింగ్‌పై ఆంక్షలు విధించింది. ఆర్సీబీ శిబిరంలో హేజిల్‌వుడ్ ఆలస్యంగా చేరడానికి కారణం.. ఎన్వోసీ జాప్యమే.
SRH have now beaten RR in six out of seven games in Hyderabad!#IPL2026 #SRHvsRR pic.twitter.com/mgVGEOW4wM
— Cricbuzz (@cricbuzz) April 14, 2026