SRH vs KKR : క్వాలిఫయర్ 1లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు తొలి ఓవర్లోనే భారీ షాక్. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(0) సున్నాకే ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ యార్కర్‌ను అంచనా వేయలేక బౌల్డ్ అయ్యాడు. దాంతో, పరుగుల ఖాతా తెరవకుండానే ఆరెంజ్ ఆర్మీ తొలి వికెట్ పడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(8) రెండు బౌండరీలు బాదేశాడు. అభిషేక్ శర్మ(0) ఇంకా ఖాతా తెరవలేదు.
హైదరాబాద్ తుది జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షహ్బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్.
కోల్‌కతా తుది జట్టు : రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.