IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ కొట్టిన సన్ రైజర్స్‌కు కోల్‌కతా బౌలర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వైభవ్ అరోరా, హర్షిత్ రానాల విజృంభణతో టాపార్డర్ కుప్పకూలింది. డేంజరస్ ట్రివిస్ హెడ్(4).. అభిషేక్ శర్మ(2), ఇషాన్ కిషన్(2)లు నిమిషాల వ్యవధిలోనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. 201 ఛేదనలో టాప్ గన్స్ 9 పరుగుల లోపే డగౌట్ చేరారు.
4, 2, 2.. టీ20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్ల స్కోర్లివి. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా బౌలర్ల ధాటికి పట్టుమని 10 నిమిషాలు కూడా క్రీజులో నిలవలేదు సన్‌రైజర్స్ ఓపెనర్లు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో బౌండరీ బాదిన హెడ్.. ఆ వెంటనే భారీ షాట్ ఆడి హర్షిత్ రానాకు చిక్కాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ పడడంతో.. అభిషేక్, ఇషాన్‌లపై ఒత్తిడి పెరిగింది. బౌండరీ లక్ష్యంగా ఆడిన వీళ్లిద్దరూ అయ్యర్, రహానేకు క్యాచ్ ఇచ్చి
స్వల్పస్కోర్‌కే డగౌట్ చేరారు.
Rapid Rahane, Rampant #KKR 🔝 👊
A superb catch to highlight a dream start for KKR in the field 👌
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders | @ajinkyarahane88 pic.twitter.com/gWhXWfLxff
— IndianPremierLeague (@IPL) April 3, 2025
అయితే.. 5వ ఓవర్లో నితీశ్ కుమార్(19) రెండు ఫోర్లు, సిక్సర్ బాదాడు. కానీ, ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. అదే ఓవర్లో కమిందు మెండిస్(25) ఫైన్‌లెగ్ దిశగా సిక్సర్ బాదడంతో స్కోర్ 50కి చేరింది. హెన్రిచ్ క్లాసెన్(10) జతగా మెండిస్ కీలక భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు. 9 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 63-4.