SRH vs KKR : పదిహేడో సీజన్ ఫైనల్ ఫైట్‌కు రంగం సిద్దమైంది. లీగ్ దశ నుంచి సంచలన ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్లు టైటిల్ పోరులో తలపడుతున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ సారథి కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. క్వాలిఫయర్ 1లో ఓటమికి హైదరాబాద్ జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా మిచెల్ స్టార్క్ బుల్లెట్ వేగానికి, స్పిన్ ద్వయం చక్రవర్తి, నరైన్‌లకు దాసోహమవుతుందా? అనేది చూడాలి.
సన్‌రైజర్స్ తుది జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎడెన్ మర్క్రమ్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట కీపర్), షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(), భువనేశ్వర్, జయదేవ్ ఉనాద్కాట్, నటరాజన్.
కోల్‌కతా తుది జట్టు : రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
🚨 Toss Update 🚨
Sunrisers Hyderabad 🧡 elect to bat in the #Final against Kolkata Knight Riders 💜
Follow the Match ▶️ https://t.co/lCK6AJCdH9#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/f4PWxfLFEK
— IndianPremierLeague (@IPL) May 26, 2024
ఇంప్యాక్ట్ సబ్స్ : హైదరాబాద్ – ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిఫ్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్. కోల్‌కతా – అంకుల్ రాయ్, మనీశ్ పాండే, నితీశ్ రానా, శ్రీకర్ భరత్, రూథర్‌ఫర్డ్.
పదిహేడో సీజన్లో టాప్ క్లాస్ ఆటతో అదరగొట్టిన కోల్‌కతా ఆఖరి పోరులోనూ విజయంపై ధీమాగా ఉంది. మెంటార్‌గా గౌతం గంభీర్ రాకతో కోల్‌కతా జట్టు ప్రమాదకరంగా తయారైంది. గత సీజన్లలో తేలిపోయిన విండీస్ వీరులు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్‌లు వీరబాదుడుతో భయపెడుతున్నారు.
ఇక స్పిన్ యూనిట్లో వరుణ్ చక్రవర్తి ఇప్పటికే 20 వికెట్లు పడగొట్టాడు. దాంతో, ఫైనల్లో ఈ నలుగురితో పాటు మిస్సైల్ స్టార్క్(Mitchell Starc) నుంచి సన్‌రైజర్స్ బ్యాటర్లకు ముప్పు తప్పకపోవచ్చు. లీగ్ దశలో, క్వాలిఫయర్ 1లో హైదరాబాద్‌ను వణికించిన కేకేఆర్ మళ్లీ అదే సీన్ రిపీట్ చేయాలనుకుంటోంది. అయితే.. ఐపీఎల్ చరిత్రను షేక్ చేసిన సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించినట్టే.
సన్‌రైజర్స్ జట్టు పదిహేడో సీజన్లో విధ్వంసక ఆటకు కేరాఫ్ అయింది. కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ రావడం, ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఆరెంజ్ ఆర్మీకి పూనకాలు తెప్పించాయి. అభిషేక్ శర్మ భీకర ఫామ్ కొనసాగిస్తుండగా.. రాహుల్ త్రిపాఠి తుఫాన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. ఇక మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ మెరుపు బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు కొండంత స్కోర్ అందిస్తున్నాడు.
ఈ సీజన్ ఆసాంతం బ్యాటర్లనే నమ్ముకున్న కమిన్స్ సేకు బౌలర్లు తొలి విజయాన్ని కట్టబెట్టారు. అదికూడా చావోరేవో మ్యాచ్ అయిన క్వాలిఫయర్ 2లో. చెపాక్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న తీరు అమోఘం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు షాబాజ్, అభిషేక్‌లు సంచలన స్పెల్‌తో సంజూ సేనకు ఓటమి రుచి చూపించారు. ఫైనల్ మ్యాచ్ కూడా చెపాక్‌లోనే జరగడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశమే.