Animesh Kujur | 100 మీటర్లు 10.14 సెకన్లలో.. తొలి భారతీయుడిగా అనిమేశ్ రికార్డు..!
Animesh Kujur : భారత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఆశాకిరణంగా అవతరించిన అనిమేశ్ కుజుర్ (Animesh Kujur) మరోసారి వార్తల్లో నిలిచాడు. విదేశీ గడ్డపై 10.14 సెకన్లలోనే 100 మీటర్ల పరుగును పూర్తి చేశాడు.
Animesh Kujur : భారత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఆశాకిరణంగా అవతరించిన అనిమేశ్ కుజుర్ (Animesh Kujur) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇండియన్ ఉసేన్ బోల్ట్‌గా పేరొందిన ఈ కుర్రాడు విదేశీ గడ్డపై 10.14 సెకన్లలోనే 100 మీటర్ల పరుగును పూర్తి చేశాడు. జర్మనీ వేదికగా జరిగిన పుమా ఫాస్ట్ ఆర్మ్స్ లెగ్స్ 2026 మీట్(PUMA Fast Arms Legs 2026 Meet)లో సత్తా చాటిన అనిమేశ్ భారత్ అవతల ఇంత వేగంతో వంద మీటర్లు పరుగెత్తిన తొలి అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు.
ట్రాక్ మీద బుల్లెట్ వేగంతో దౌడు తీస్తూ జాతీయ స్థాయిలో రికార్డులు బద్ధలు కొడుతున్న అనిమేశ్ కుజుర్ మళ్లీ మెరిశాడు. టోక్యోలో జరుగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిక్స్ మీద గురి పెట్టిన అతడు పుమా పాస్ట్ ఆర్మ్స్ లెగ్స్ 2006 మీట్లో చిరుతలా పరుగుతీశాడు. 10.14 సెకన్లలోనే 100 మీటర్ల పరుగును పూర్తి చేసి ఔరా అనిపించాడు. తొలుత 10.19 సెకన్లకు పరిమితమైన అనిమేశ్ ఫైనల్లో తన వేగాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. అయితే.. అత్యంత వేగంగా 100 మీటర్ల పరుగుతో రికార్డు సాధించిన గురిందెర్వీర్ సింగ్(10.09 సెకన్లు)ను మాత్రం అందుకోలేకపోయాడీ రన్నర్.
🚨 Animesh clocks the Fastest 100m Ever by an Indian Outside the Country!
India’s 200m national record holder Animesh Kujur finished second in the 100m final at PUMA Fast Arms Fast Legs 2026, clocking a lifetime best of 10.14s.
After running 10.19s in the heats, Animesh… https://t.co/cswwY1VykK pic.twitter.com/4nc8UKH5va
— nnis Sports (@nnis_sports) July 10, 2026
100 మీటర్ల చిరుతలు
1. గురిందెర్వీర్ సింగ్ – 10.09 సెకన్లు
2. అనిమేశ్ కుజుర్ – 10.14 సెకన్లు
3. అనిమేశ్ కుజుర్ – 10.15 సెకన్లు
4. గురిందెర్వీర్ సింగ్ – 10.17 సెకన్లు
5. అనిమేశ్ కుజుర్ – 10.18 సెకన్లు
గురిందెర్వీర్కు పోటీగా..
అనిమేశ్ కుజుర్ది ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గ్రామం. ఆరడుగుల రెండు అంగుళాల పొడవుండే ఇతడు టీనేజ్ నుంచే తన స్పీడ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈమధ్యే 100 మీటర్ల దూరాన్ని 10.18 సెకన్లలో చేరుకొని చరిత్ర సృష్టించాడు. తద్వారా గురిందెర్విర్ (10.20 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్ధలు కొట్టి ‘ది ఫాస్టెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా అవతరించాడు అనిమేశ్. 22 ఏళ్లకే దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా మారిన అతడు ఈమధ్యే మొనాకో డైమండ్ లీగ్‌లో పోటీపడ్డాడు.
OH! WOW, ANIMESH KUJUR 🔥🔥
Asian Championships medalist Animesh Kujur delivered a sensational performance at the PUMA Fast Arms Fast Legs 2026, finishing runner-up in the 100m final with a stunning personal best of 10.14s.
✅ Fastest 100m ever recorded by an Indian outside… pic.twitter.com/WQDT6imzrX
— myKhel.com (@mykhelcom) July 10, 2026
అండర్ -23 విభాగంలో 200 మీటర్ల పరుగులో ఆస్ట్రేలియా స్టార్ గౌట్ గౌట్‌తో ‘నువ్వానేనా’ అన్నట్టు పరుగు తీసి ఔరా అనిపించాడు అనిమేశ్. అయితే.. సెకన్లో పదో వంతుతో పోడియం మీద నిల్చొనే అవకాశం కోల్పోయాడు. అయినా సరే.. అతడేమీ నిరాశకు లోనవ్వడం లేదు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో అంతర్జాతీయ వేదికలపై భారతీయ జెండాను రెపరెపలాడించేందుకు మరింత గట్టిగా ప్రయత్నించేందుకు సిద్దమవుతున్నాడీ యంగ్ అథ్లెట్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

