మాదాపూర్, ఆగస్టు 27: హైదరాబాద్ యువ బౌలర్ పటోళ్ల ఇషాంత్రెడ్డి అదరగొట్టాడు. శనివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో నేషనల్ హైకాతో జరిగిన మ్యాచ్లో నోబుల్ హైకా బౌలర్ ఇషాంత్రెడ్డి(5/35) ఐదు వికెట్లతో విజృంభించాడు. దీంతో నేషనల్ హైకా జట్టు 36.2 ఓవర్లలో 184 పరుగులకు కుప్పకూలింది. ఫయాజ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఇషాంత్రెడ్డి తన లెఫ్టార్మ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నోబుల్ హైకా 48.2 ఓవర్లలో 185 పరుగులు చేసింది.