RSA vs WI | వెస్టిండీస్‌తో మొదటి టెస్టు.. 87 పరుగులతో దక్షిణాఫ్రికా విజయం
వెస్డిండీస్‌తో సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన వరుస ఓటములకు ముగింపు పలికింది. రెండో ఇన్నింగ్స్‌లో రబాడ 6 వికెట్లతో చెలరేగడంతో విండీస్ 159 పరుగులకే కుప్పకూలింది.
RSA vs WI : వెస్టిండీస్‌తో సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన వరుస ఓటములకు ముగింపు పలికింది. కొత్త సారథి తెంబా బవుమా కెప్టెన్సీ పరీక్షలో పాస్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రబాడ 6 వికెట్లతో చెలరేగడంతో విండీస్ కుప్పకూలింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన ఆ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో సఫారీ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మొదటి ఇన్నింగ్స్‌లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో 47 బాదిన మర్క్రమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. రెండో టెస్టు జొహన్నెస్‌బర్గ్‌లో మార్చి 8న జరగనుంది.
మర్క్రమ్ సెంచరీతో..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 342కు ఆలౌట్ అయింది. మర్క్రమ్ సెంచరీ(115)తో మెరిశాడు. మాజీ కెప్టెన్ ఎల్గర్ ఫిఫ్టీ (71)తో రాణించాడు. కెప్టెన్ బవుమా డకౌట్‌గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రోచ్, మేయర్స్, గాబ్రియెల్, హోల్డర్ తలా ఒక వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయింది. రీఫర్ ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. చందర్‌పాల్ (22), బ్రాత్‌వైట్ (11), బ్లాక్‌వుడ్ (37) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.
రెండో ఇన్నింగ్స్‌లో
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 116 రన్స్‌కు ఆలౌట్ అయింది. సెంచరీ వీరుడు మర్క్రమ్ 47 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. మర్క్రమ్ తర్వాత టాప్ స్కోరర్లు.. రబాడ (10), గెరాల్డ్ గోయెట్జ్ (20). విండీస్ పేసర్ కీమర్ రోచ్ ఐదు వికెట్లతో సఫారీలను దెబ్బ కొట్టాడు. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 159కే కుప్పకూలింది. రబాడ ఆరు వికెట్లతో చెలరేగాడు.
ఇవి కూడా చదవండి
Kely Nascimento | పీలె చివరి క్షణాల్లో మెస్సీ గురించే.. నాన్న కల నిజమైందన్న కూతురు
Jasprit Bumrah | సర్జరీ కోసం న్యూజిలాండ్‌కు బుమ్రా..! ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ
Legends League Cricket | మళ్లీ బ్యాట్ పట్టనున్న గంభీర్, ఫించ్, ఆఫ్రీది.. లెజెండ్స్ లీగ్స్‌లో కెప్టెన్లుగా బరిలోకి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

