సఫారీలు సాఫీగా..
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న సఫారీలు.. త్వరగానే తేరుకొని మైదానంలో సమిష్టిగా కదంతొక్కారు.
- అఫ్గానిస్థాన్‌పై విజయం
- మెరిసిన డసెన్, కోట్జీ
- అజ్మతుల్లా పోరాటం వృథా
మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొండంత లక్ష్యాలను నిర్దేశిస్తున్నా.. చేజింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా.. ఆ అడ్డంకిని కూడా అధిగమించింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై సఫారీ జట్టు విజయం సాధించింది. మొదట బౌలర్లు రాణించి అఫ్గాన్‌ను కట్టడి చేయగా.. బ్యాటింగ్‌లో డసెన్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో దక్షిణాఫ్రికా రెండో స్థానంతో లీగ్ దశను ముగించి.. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు సిద్ధమైంది.
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న సఫారీలు.. త్వరగానే తేరుకొని మైదానంలో సమిష్టిగా కదంతొక్కారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. దీంతో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న దక్షిణాఫ్రికా పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ లక్ష్యాన్ని ఛేదించలేక తడబడ్డ సఫారీలు ఈ సారి ఆ పొరబాటు చేయలేదు.

టాస్ గెలిచిన అఫ్గాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జట్టు 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. పేస్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ (97 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) నాణ్యమైన ఇన్నింగ్స్‌తో విజృంభించగా.. అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. రహ్మానుల్లా గుర్బాజ్ (25), ఇబ్రహీం జద్రాన్ (15), రహ్మత్ షా (26), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (2), ఇక్రామ్ (12), మహమ్మద్ నబీ (2), రషీద్‌ఖాన్ (14) ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో నూర్ అహ్మద్ (26) కీలక పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కోట్జీ 4, ఎంగిడి, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ముఖ్యంగా కేశవ్ తన స్పిన్‌తో అఫ్గాన్ బ్యాటర్లను కట్టిపడేశాడు. ఏకబిగిన పది ఓవర్లు వేసి కేవలం 25 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ డసెన్ (76 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో రాణించగా.. డికాక్ (41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెలుక్వాయో (39 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు), మార్క్మ్ (25), మిల్లర్ (24), బవుమా (23) తలా కొన్ని పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్, నబీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. డసెన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్: 244 (అజ్మతుల్లా 97 నాటౌట్; కోట్జీ 4/44, కేశవ్ మహరాజ్ 2/25), దక్షిణాఫ్రికా: 47.3 ఓవర్లలో 247/5 (డసెన్ 76 నాటౌట్; ఫెలుక్వాయో 39 నాటౌట్; నబీ 2/35, రషీద్ 2/37).

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

