Keshav Maharaj | తండ్రి కాబోతున్న సఫారీ స్పిన్నర్.. సెలబ్రేషన్ వీడియో వైరల్
Keshav Maharaj : దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) తండ్రి కాబోతున్నాడు. మహరాజ్ భార్య లెరీషా మున్స్వామి(Lerisha Munswamy,) త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని 'జెండర్ రివీల్ పార్టీ'(Gender Reveal Party)లో...
Keshav Maharaj : దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) తండ్రి కాబోతున్నాడు. మహరాజ్ భార్య లెరీషా మున్స్వామి(Lerisha Munswamy,) త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని ‘జెండర్ రివీల్ పార్టీ'(Gender Reveal Party)లో ఈ జంట వెల్లడించింది. ఈ సందర్భంగా’మా బేబీ గర్ల్‌ను చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అంటూ లెరీషా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ పెట్టింది.
‘మా జీవితంలోని గొప్ప క్షణాన్ని కుటుంబసభ్యులు, మిత్రులతో పంచుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ లెరీషా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఆ వీడియోలో కేశవ్ మహరాజ్, లెరీషా కేకు కట్ చేశారు. అనంతరం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సంబురాలు చేసుకున్నారు.
కేశవ్ మహరాజ్, లెరీషా ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవాళ్లే. లెరీషా ఒక కథక్ డ్యాన్సర్. స్నేహితులు ద్వారా పరిచమైన ఈ ఇద్దరూ మొదట్లో ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఆ తర్వాత అభిరుచులు కలవడం.. అది ప్రేమకు దారి తీయడంతో 2022 ఏప్రిల్‌లో పెండ్లి చేసుకున్నారు. ఫస్ట్ క్లాస్‌లో రాణించిన 2016లో జాతీయ జట్టులోకి వచ్చాడు. అనతికాలంలోనే సఫారీ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు.
వికెట్ తీసిన మహరాజ్‌ను అభినందిస్తున్న సహచరులు

ఇప్పటివరకూ మహరాజ్ 49 టెస్టులు, 44 వన్డేలు, 27 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 31.99 సగటుతో 158 వికెట్లు.. వన్డేల్లో 55 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 7.39 ఎకానమీతో 24 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు మహరాజ్‌కు టెస్టుల్లో బ్యాటర్‌గా మంచి రికార్డు ఉంది. ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 84.
ఇవి కూడా చదవండి
- PM Modi | రామ్ లల్లా-నరేంద్ర మోదీ లీలా
- LIC | ఎస్బీఐని మించిన ఎల్ఐసీ.. అత్యంత విలువైన పీఎస్‌యూగా బీమా దిగ్గజం
- Actress Anjali | ఆ సన్నివేశాలు ఇబ్బందిగా అనిపిస్తాయి: అంజలి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

