Actress Anjali | ఆ సన్నివేశాలు ఇబ్బందిగా అనిపిస్తాయి: అంజలి
అచ్చ తెలుగు అందం అంజలి తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దూసుకుపోతున్నది. కథాబలమున్న చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నది. ‘
Actress Anjali | అచ్చ తెలుగు అందం అంజలి తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దూసుకుపోతున్నది. కథాబలమున్న చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రంతో ఈ భామ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది. ఇదిలావుండగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించడంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది అంజలి. ఇంటిమేట్ సీన్స్ తనకు అసౌకర్యంగా అనిపిస్తాయని, అయితే కథానుగుణంగా కొన్నిసార్లు అంగీకరించాల్సి వస్తుందని చెప్పింది.
‘నిజజీవితంలో ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి, ఆన్‌స్క్రీన్‌లో ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి చాలా తేడా ఉంటుంది. అలాంటి సీన్స్ చేసేటప్పుడు నా కోస్టార్ ఏమనుకుంటాడో, ఎలా స్వీకరిస్తాడోననే టెన్షన్ ఉంటుంది. ఒక్కోసారి కథలో భాగంగా రొమాన్స్ పండించడానికి అలాంటి సీన్స్‌లో నటించడం తప్పనిసరి అవుతుంది. అప్పుడు ఇష్టం లేకున్నా చేయాల్సిందే. ఏదిఏమైనా ముద్దు సీన్స్‌లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని అంజలి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నది. తమిళం, మలయాళంలో కొన్ని సినిమాలను ఓకే చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

