ఆస్ట్రేలియా తడబాటు.. తొలి ఇన్నింగ్స్‌లో 187/6.. ఆదుకున్న రెన్షా, కమిన్స్
ఆరేండ్ల క్రితం ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురిచేసిన ‘శాండ్‌పేపర్ గేట్' వివాదం తర్వాత దక్షిణాఫ్రికాలో మొదటి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. కింగ్స్‌మీడ్ మైదానంలో సఫారీ పేసర్లు నిప్పులు చెరగడంతో కంగారూ టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ తేలిపోయింది.
డర్బన్ : ఆరేండ్ల క్రితం ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురిచేసిన ‘శాండ్‌పేపర్ గేట్’ వివాదం తర్వాత దక్షిణాఫ్రికాలో మొదటి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. కింగ్స్‌మీడ్ మైదానంలో సఫారీ పేసర్లు నిప్పులు చెరగడంతో కంగారూ టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ తేలిపోయింది. శుక్రవారంతొలిరోజు వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ 65.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది.
సౌతాఫ్రికా పేస్ త్రయం మార్కో యాన్సెన్ (2/35), వియాన్ మల్డర్ (2/31), చాలాకాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆన్రిచ్ నోకియా (2/40) కంగారూలను క్రీజులో నిలువనీయలేదు. లబూషేన్ (37), స్టీవ్ స్మిత్ (25) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే యత్నం చేసినా ఆరు బంతుల వ్యవధిలో ఈ జోడీ నిష్క్రమించడంతో ఆసీస్‌కు కష్టాలు రెట్టింపయ్యాయి. ఒకదశలో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూలను రెన్షా (46 బ్యాటింగ్), కెప్టెన్ కమిన్స్ (33 బ్యాటింగ్) ఆదుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

