FIFA World Cup 2026 | కల నిజమాయే.. నాకౌట్ బెర్తుతో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా..!
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా(South Africa) చరిత్ర సృష్టించింది. ఏళ్ల ఎదురుచూపులకు మంగళం పలుకుతూ తొలిసారి లీగ్ దశను దాటింది.
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా(South Africa) చరిత్ర సృష్టించింది. ఏళ్ల ఎదురుచూపులకు మంగళం పలుకుతూ తొలిసారి లీగ్ దశను దాటింది. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాను ఓడించిన సఫారీ టీమ్ నాకౌట్లో అడుగుపెట్టింది. కీలకమైన గోల్‌తో తపెలో మసెకో కోట్లాది మంది ఆశల్ని నిజం చేశాడు. దాంతో.. నాకౌట్ బెర్తు ద్వారా దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్‌లో కొత్త అధ్యాయం మొదలైంది.
సాకర్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా కల నిజమైంది. ప్రతిసారి లీగ్ దశలోనే నిష్క్రమించే ఆ జట్టు ఈసారి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నాకౌట్‌కు దూసుకెళ్లింది. కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఎడిషన్‌ను సరైన సన్నాహకాలు లేకుండానే ఆరంభించిన సఫారీ టీమ్.. మెక్సికో చేతిలో కంగుతిన్నది.
A defeat, a draw, a win – the journey of Bafana Bafana in Group A that sees them end on 4 points, 2nd behind co-hosts Mexico.
South Africa make history by advancing to the Round of 32 at a FIFA World Cup for the first time ever#BafanaPride#BafanaBafana#FIFAWorldCup pic.twitter.com/DFgCXYOeLd— Bafana Bafana (@BafanaBafana) June 25, 2026
అయితే.. చెక్ రిపబ్లిక్‌తో డ్రా చేసుకోవడం కలిసొచ్చింది. గురువారం దక్షిణ కొరియాపై అదిరే ఆటతో లీగ్ దశ గండాన్ని దాటింది దక్షిణాఫ్రికా. ఉత్కంఠ పోరులో ఇరుజట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. చివరకు తపెలో మసెకో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపగా 1-0తో రెయిన్బో టీమ్ నాకౌట్ బెర్తు పట్టేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

