IND Vs SA Test | మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టు.. భారత్‌పై దక్షిణాఫ్రికా జయకేతనం
ప్రత్యర్థి బ్యాటర్లు గంటల కొద్ది క్రీజులో పాతుకుపోయి.. మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టిన చోట మన స్టార్లు కనీస పోరాటం కనబర్చలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు సహకరించింది అని సర్దిచెప్పుకున్నా.. మంచి ఎండ కాసి బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించిన సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో మనవాళ్లు పూర్తిగా తేలిపోయారు.
- తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జయకేతనం
- ఇన్నింగ్స్ 32 పరుగులతో భారత్ ఓటమి
- కోహ్లీ పోరాటం వృథా
గత మూడు దశబ్దాలుగా ఊరిస్తున్న టెస్టు సిరీస్‌ను ఈసారైనా టీమిండియా చేజిక్కించుకుంటుందనుకుంటే.. అది అత్యాశే అయింది. సఫారీ గడ్డపై అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన రోహిత్ సేన బాక్సింగ్ డే టెస్టులో ఘోర పరాజయం మూటగట్టుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో రాహుల్, బుమ్రా, కోహ్లీ తప్ప మిగిలిన వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రెండు మ్యాచ్‌ల సిరీస్ కావడంతో ఈ సారి కూడా మనవాళ్లు రిక్తహస్తాలతోనే స్వదేశానికి తిరిగి రావడం ఖాయమైనట్లే!
IND Vs SA Test | సెంచూరియన్: ప్రత్యర్థి బ్యాటర్లు గంటల కొద్ది క్రీజులో పాతుకుపోయి.. మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టిన చోట మన స్టార్లు కనీస పోరాటం కనబర్చలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు సహకరించింది అని సర్దిచెప్పుకున్నా.. మంచి ఎండ కాసి బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించిన సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో మనవాళ్లు పూర్తిగా తేలిపోయారు. డగౌట్లో ఏదో ముఖ్యమైన పని ఉన్నట్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఫలితంగా మూడు రోజుల్లో ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది.
దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యం సాధించగా.. తదుపరి మ్యాచ్‌లో భారత్ నెగ్గినా.. సిరీస్ చేతికి చిక్కదు. ఓవర్‌నైట్ స్కోరు 256/5తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌటైంది. డీన్ ఎల్గర్ (185; 28 ఫోర్లు) భారీ సెంచరీతో కదంతొక్కగా.. మార్కో జాన్సెన్ (84 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 131 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (76; 12 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేయగా.. అతడితో పాటు శుభ్‌మన్ గిల్ (26; 6 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. కెప్టెన్ రోహిత్ (0) డకౌట్ కాగా.. యశస్వి జైస్వాల్ (5), శ్రేయస్ అయ్యర్ (6), కేఎల్ రాహుల్ (4), అశ్విన్ (0), శార్దూల్ ఠాకూర్ (2) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో బర్గర్ 4, జాన్సన్ మూడు వికెట్లు పడగొట్టారు. ఎల్గర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య వచ్చే నెల 3 నుంచి కేప్‌టౌన్‌లో రెండో టెస్టు జరగనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 245;
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 408 (ఎల్గర్ 185, జాన్సెన్ 84 నాటౌట్; బుమ్రా 4/69, సిరాజ్ 2/91),
భారత్ రెండో ఇన్నింగ్స్: 131 (కోహ్లీ 76; బర్గర్ 4/33, జాన్సెన్ 3/36).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

