భారత పర్యటనకు సఫారీ జట్టు ఇదే..
వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్ ఇదే కాగా.. ఐదేండ్ల తర్వాత వేన్ పార్నెల్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
- ఐదేండ్ల తర్వాత పార్నెల్‌కు పిలుపు
జొహన్నెస్‌బర్గ్: వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్ ఇదే కాగా.. ఐదేండ్ల తర్వాత వేన్ పార్నెల్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో సఫారీ టీమ్‌కు టెంబా బవుమా సారథ్యం వహించనుండగా.. ట్రిస్టాన్ స్టబ్స్ తొలిసారి జట్టుకు ఎంపికయ్యాడు.
గాయం నుంచి కోలుకొని ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నోర్జేతో పాటు సీనియర్ ఆటగాళ్లు రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌కు చాన్స్ లభించింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య వచ్చే నెల 9న ఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనుండగా.. ఆ తర్వాత వరుసగా కటక్ (జూన్ 12), విశాఖపట్నం (జూన్ 14), రాజ్‌కోట్ (జూన్ 17), బెంగళూరు (జూన్ 19)లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, క్లాసెన్, కేశవ్, మార్క్మ్,్ర మిల్లర్, ఎంగ్డీ, నోర్జే, పార్నెల్, ప్రిటోరియస్, రబడ, షంసీ, స్టబ్స్, డసెన్, జాన్సెన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- India
- South Africa
- squad
- T20I
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

