అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఏబీ డివిలియర్స్

సెంచూరియన్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ .. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని ఇవాళ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 37 ఏళ్ల వయసులో తనలో ఆడే సత్తా అంతగా లేదన్న రీతిలో కామెంట్ చేశాడు. తన కెరీర్లో అద్భుతమైన జర్నీ సాగిందని, అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. 2004లో ఏబీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికాకు అతను 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 20014 రన్స్ చేశాడు. టెస్టులు, వన్డేల్లో అతని సగటు 50 కన్నా ఎక్కువే ఉంది. వాస్తవానికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి అతను 2018 మేలోనే తప్పుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీకి ఆడుతున్నాడు. తాజా రిటైర్మెంట్తో ఏబీ ఇక ఆర్సీబీకి కూడా దూరంకానున్నాడు. 2021 ఐపీఎల్‌లోనూ ఆర్సీబీ తరపున డివిలియర్స్ ఆడాడు. టీ20 కెరీర్లో 340 మ్యాచ్‌లు ఆడిన అతను 150.13 స్ట్రయిక్ రేటుతో 9424 రన్స్ చేశాడు.
It has been an incredible journey, but I have decided to retire from all cricket.
— AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021
Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

