SA vs BAN | మూడు వందలా.. మాకు చాలా ఈజీ అంటున్న సౌతాఫ్రికా.. వరుసగా ఏడోసారి త్రిశతకం దాటిన సఫారీలు
SA vs BAN | పొట్టి ఫార్మాట్‌కు అలవాటుపడ్డ పలు క్రికెట్ జట్లు.. బంతిని బాదే క్రమంలో కొన్నిసార్లు గురితప్పుతున్నాయి. కానీ సౌతాఫ్రికా మాత్రం 300 అంటే అదేదో మంచినీళ్లు తాగినంత ఈజీగా దంచిపడేస్తుంది.
SA vs BAN | అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్ వచ్చాక ఎంతపెద్ద లక్ష్యమైనా చిన్నదైపోతున్న తరుణంలో వన్డేలలో మాత్రం ఇప్పటికీ 300 అంటే తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపుపై ధీమాగా ఉండొచ్చు. బౌలింగ్‌లో కాస్త కట్టడిచేసి ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెడితే విజయం మీద నల్లేరుమీద నడకే. పొట్టి ఫార్మాట్‌కు అలవాటుపడ్డ పలు క్రికెట్ జట్లు.. బంతిని బాదే క్రమంలో కొన్నిసార్లు గురితప్పుతున్నాయి. కానీ సౌతాఫ్రికా మాత్రం 300 అంటే అదేదో మంచినీళ్లు తాగినంత ఈజీగా దంచిపడేస్తుంది. మొదట బ్యాటింగ్ చేస్తూ ఆ జట్టు గత ఏడు మ్యాచ్‌లలోనూ తమ స్కోరును త్రిశతకాలు దాటించడం గమనార్హం.
వన్డే వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కూడా తొలిరెండు వన్డేలలో తడబడినా సఫారీలు తర్వాత పుంజుకున్నానరు. ఆ సిరీస్‌లో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు.. 338 పరుగులు చేశారు. ఆ తర్వాత ఇదే సిరీస్‌లో వరుసగా 416, 315 పరుగులు సాధించారు. తొలి రెండు వన్డేలలో ఓడిన ప్రొటీస్.. మిగిలిన మూడు వన్డేలలో గెలిచి సిరీస్ గెలుచుకున్నారు. అనంతరం వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఈనెల 7న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 428 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత ఆస్ట్రేలియాతో 311 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో సఫారీలు ఛేదనకు దిగారు. మళ్లీ ఇంగ్లండ్‌తో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 399 పరుగుల భారీ స్కోరు చేశారు. తాజాగా బంగ్లాదేశ్‌తో కూడా మొదట బ్యాటింగ్‌కు వచ్చి 382 పరుగులు చేయడం విశేషం. ఈ ఏడు మ్యాచ్‌లలో సఫారీలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
South Africa in World Cup 2023 while batting first:
428/5(50) vs Sri Lanka.
311/7(50) vs Australia.
399/7(50) vs England.
382/5(50) vs Bangladesh.– This is madness…..!!!!! pic.twitter.com/bjjO2ECCJG
— Johns. (@CricCrazyJohns) October 24, 2023
తాజాగా బంగ్లాతో మూడు వందలు దాటిన నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికసార్లు 350 ప్లస్ స్కోరు దాటిన జట్లలో సౌతాఫ్రికా (8).. ఆస్ట్రేలియా (7)ను దాటేసింది. ఈ జాబితాలో భారత్ నాలుగుసార్లు ఈ ఘనత సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

