Sourav Ganguly | సర్ఫరాజ్ టీ20ల కంటే టెస్టులకే పనికొస్తాడు.. ఎందుకంటే..?
Sourav Ganguly : ఇంగ్లండ్ సిరీస్‌లో భారత జట్టుకు కుర్రాళ్లే కొండంత అండగా నిలిచారు. ఈ టెస్టు సిరీస్‌తో టీమిండియాకు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) రూపంలో విలువైన ఆటగాడు దొరికాడు. రాజ్‌కోట్ టెస్టు (Rajkot Test)లో అరంగేట్రం చేసిన...
Sourav Ganguly : ఇంగ్లండ్ సిరీస్‌లో భారత జట్టుకు కుర్రాళ్లే కొండంత అండగా నిలిచారు. అరంగేట్రంలోనే సంచలన ప్రదర్శనతో రోహిత్ సేన సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ టెస్టు సిరీస్‌తో టీమిండియాకు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) రూపంలో విలువైన ఆటగాడు దొరికాడు. రాజ్‌కోట్ టెస్టు (Rajkot Test)లో అరంగేట్రం చేసిన ఈ ముంబై క్రికెటర్ అద్భుతంగా రాణించాడు. దాంతో ధర్మశాల టెస్టుకు ముందు సర్ఫరాజ్‌పై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు టీ20 లకంటే సుదీర్ఘ ఫార్మాట్‌కే బాగా సరిపోతాడని దాదా అన్నాడు.
‘సర్ఫరాజ్ నిఖార్సైన టెస్టు ఆటగాడు. అతడి ఆట టీ20ల కంటే టెస్టులకు బాగా సరిపోతుంది. దేశవాళీ క్రికెట్లో అతడు ఎన్నో రన్స్ సాధించాడు. రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబై తరఫున సర్ఫరాజ్ పరుగుల వరద పారించాడు. ఓ ఆటగాడు పరుగులు సాధిస్తే అది ఎప్పటికీ వృథా కాదు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ అదే జరిగింది’ అని గంగూలీ వెల్లడించాడు. ఫస్ట్ క్లాస్‌లో 47 మ్యాచులు ఆడిన సర్ఫరాజ్ 68.74 సగటుతో 4,056 పరుగులు సాధించాడు. అతడి పేరిట 14 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సర్ఫరాజ్(62, 68)

రాజ్‌కోట్‌లో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్న సర్ఫరాజ్.. తొలి ఇన్నింగ్స్‌లో 62, రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు 48 బంతుల్లోనే 50 రన్స్ కొట్టిన సర్ఫరాజ్ టీమిండియా తరఫున రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు. దూకుడుగా ఆడడంతో పాటు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న సర్ఫరాజ్ రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్ బౌలర్లపై పైచేయి సాధించాడు.
Iss 6️⃣ ka raaz sirf 𝙎𝙖𝙧𝙛𝙖-𝙧𝙖𝙯 ke pass hai! 🤌🏻
A swift 50-run partnership, thanks to the Mumbai boys! 💪🏻#INDvENG #BazBowled #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/tT7jY0Fr7m
— JioCinema (@JioCinema) February 18, 2024
అయితే.. రాంచీ టెస్టులో విఫలమైనప్పటికీ ఆఖరి టెస్టులో సత్తా చాటేందుకు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారత జట్టు 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రమైన ఐదో టెస్టు మార్చి 7వ తేదీన ధర్మశాలలో షురూ కానుంది.
ఇవి కూడా చదవండి
- Mirchi market | కన్నెర్రజేసిన మిర్చి రైతు.. ఖమ్మం మిర్చి మార్కెట్ ఎదుట ఆందోళన
- Ponnala Lakshmaiah | రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై అర్ధసత్య ఆరోపణలు: పొన్నాల లక్ష్మయ్య
- Brutal murder | మారేడుపల్లిలో వ్యక్తి దారుణ హత్య.. ప్రాణం తీసిన మద్యం గొడవ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

