హైదరాబాద్, ఆట ప్రతినిధి: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్‌కు హైదరాబాద్‌కు చెందిన సోమ్‌నాథ్ ఘోష్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జూలై 13 నుంచి 30వరకు పుణె వేదికగా జరిగే యూటీటీ టోర్నీలో జర్మనీకి చెందిన కోచ్ జోర్గ్ బిట్జియోతో కలిసి ఘోష్ పనిచేయనున్నాడు. అంతర్జాతీయ టీటీలో అపార అనుభవమున్న జోర్గ్, ఘోష్ కలయిక తమకు కలిసి వస్తుందని చెన్నై లయన్స్ యజమాని హరిణి యాదవ్ పేర్కొన్నారు. యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజను అంతర్జాతీయ స్థాయి ప్లేయర్‌గా తీర్చిదిద్దడంలో సోమ్‌నాథ్ కీలక పాత్ర పోషించాడు.