BANW vs SAW | పోరాడిన శోభన, సుల్తానా.. సఫారీలను ఉరిస్తున్న స్వల్ప లక్ష్యం..!
BANW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. సెమీస్ బెర్తును పట్టేయాలనే కసిని ప్రదర్శించి.. బంగ్లాదేశ్ జట్టును స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు.
BANW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. సెమీస్ బెర్తును పట్టేయాలనే కసిని ప్రదర్శించి.. బంగ్లాదేశ్ జట్టును స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా శోభనా మోస్త్రే(42), షర్మీ అక్తర్(22), కెప్టెన్ నిగర్ సుల్తానా(32) రాణించడంతో వంద పరుగులు చేయగలిగింది. మ్లాబా తిప్పేయడంతో 117 రన్స్‌కే పరిమితమైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ 117 పరుగులే చేసింది. భారీ స్కోర్‌తో దక్షిణాఫ్రికాకు సవాల్ విసరాలనుకున్న ఆ జట్టును మరిజానే కాప్(1-9) తొలి ఓవర్ మొదటి బంతికే దెబ్బకొట్టింది. ఓపెనర్ ఫిర్దౌస్(0)ను బౌల్డ్ చేసి షాకిచ్చింది షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో తేజ్ నెహర్(1) ఎల్బీగా ఔటవ్వగా.. 14 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది.
Nigar Sultana Joty’s quickfire 32* off 20 lifts Bangladesh to 117/5 after Sobhana Mostary’s 42 – will this be a comfortable chase for South Africa?
Follow live: https://t.co/W0MZdRiEB7 pic.twitter.com/sPqeR3mEO3
— Cricinfo (@cricinfo) June 28, 2026
కాప్, ఇస్మాయిలు నిప్పులు చెరుగుతుండడంతో ఓపికగా ఆడిన శోభనా మోస్త్రే(42), షర్మీన్ అక్తర్(22)లు ఇన్నింగ్స్ నిర్మించారు. షర్మీన్ను మ్లాబా పెవిలియన్ చేర్చగా.. నిగర్ సుల్తానా(32) పోరాడింది. మోస్త్రే జతగా సఫారీ బౌలర్లను కాచుకున్న సుల్తానా ఆఖరి వరకూ నిలిచినా బంగ్లా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 117 రన్స్ చేసిందంతే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

