చాంపియన్ కృతిక
తండ్రికి తగ్గ తనయ అని నిరూపించుకుంది కృతిక. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు గారాలపట్టి కృతిక అథ్లెటిక్స్‌లో అదరగొడుతున్నది.
- సత్తాచాటిన దివంగత ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమార్తె
- రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కైవసం
కొత్తగూడెం అర్బన్: తండ్రికి తగ్గ తనయ అని నిరూపించుకుంది కృతిక. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు గారాలపట్టి కృతిక అథ్లెటిక్స్‌లో అదరగొడుతున్నది. పిట్టకొంచెం కూత ఘనమన్నట్లు 8వ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కృతిక పసిడి కాంతులు విరజిమ్మింది. మంగళవారం జరిగిన బాలికల అండర్-10 లాంగ్‌జంప్ ఈవెంట్లో ఈ చిచ్చరపిడుగు 3.46మీటర్లు లంఘించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా అథ్లెటిక్స్‌లో నిలకడగా రాణిస్తున్న కృతిక ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ పతకాలు కొల్లగొడుతున్నది. గత నెల ఆఖర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలోనూ ఈ యంగ్చాంప్ మెరుపులు మెరిపించింది.
చదువులోనే కాదు తనకెంతో ఇష్టమైన లాంగ్‌జంప్‌లో భవిష్యత్ చాంపియన్‌గా మన్ననలు అందుకుంటున్నది. పసితనంలోనే తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుతూ కృతిక రాణిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటున్నది. తండ్రి కన్న కలలను నెరవేరుస్తున్న ఈ లిటిల్ చాంపియన్‌ను జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్, అసోసియేషన్ సభ్యులు సారంగపాణి, మనోహర్, కోచ్‌లు మల్లికార్జున్‌రావు, సుష్మభాయ్ ప్రత్యేకంగా అభినందించారు. బెండాలపాడు అటవీ ప్రాంతంలో డ్యూటీ చేస్తుండగా గొత్తికోయలు చేసిన దాడిలో ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌రావు ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కృతిక ఆసక్తిని గమనించిన శ్రీనివాసరావు అథ్లెటిక్స్‌లో వెన్నుతట్టి ప్రోత్సహించారు. పోటీకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటుతున్న ఈ స్పీడ్‌స్టర్ భవిష్యత్‌లోనూ పతకాలు కొల్లగొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని చూస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

