Sikinder Raza : జింబాబ్వే టీ20 కెప్టెన్ సికిందర్ రజా(Sikinder Raza) చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్లో హ్యాట్రిక్(Hat-trick) తీసిన తొలి జింబాబ్వే బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్(Africa Qualifier)లో భాగంగా సోమవారం రువాండా(Rwanda)తో జరిగిన మ్యాచ్‌లో రజా వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా హ్యాట్రిక్ తీసిన మూడో జింబాబ్వే ఆటగాడిగా రజా నిలిచాడు. అతడి కంటే ముందు నొమ్వెలొ సిబండ(Nomvelo Sibanda), ఆండ్రే మజ్విషయ(Audrey Mazvishaya) ఈ ఫీట్ సాధించారు.
టీ20 వరల్డ్ కప్ 2024 పోటీలకు ఉగాండా క్వాలిఫై అవ్వడంతో జింబాబ్వేకు ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. రువాండాతో వాండరర్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో రజా బంతితో, బ్యాటుతో చెలరేగాడు. మొదట ఓపెనర్‌గా వచ్చిన రజా (58 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం హ్యాట్రిక్ వికెట్లతో రువాండాను హడలెత్తించాడు.
సికిందర్ రజా
18వ ఓవర్లో బంతి అందుకున్న రజా.. రెండో బంతికి ముహమ్మద్ నదీర్(2)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో జప్పి బిమెన్యిమన(0), ఎమిలె రుకిరిజా(0)లను ఔట్ చేశాడు. దాంతో, ఆ జట్టు 18.4 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ 17వ సీజన్‌కు పంజాబ్ కింగ్స్(Punjab Kings) రజాను అట్టిపెట్టుకుంది. పదహారో సీజన్లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అతడిపై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. రజా 2023 ఎడిషన్ ఏడు మ్యాచుల్లో 139 పరుగులు చేశాడు. అయితే.. బంతితో 3 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.