ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ICC Player of the Month: గిల్, షఫాలీ కుమ్మేస్తున్నారు. వరుసగా భారీ స్కోర్లు చేస్తున్నారు. దీంతో ఆ క్రికెటర్లకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. గిల్ ఈ గుర్తింపు పొందడం ఇది అయిదోసారి. షెఫాలీ రెండో సారి ఈ ఘనత సాధించింది.
దుబాయ్: భారత క్రికెటర్లు శుభమన్ గిల్, షఫాలీ వర్మలు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఐసీసీ వాళ్లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్(ICC Player of the Month)గా రికార్డు స్థాయిలో అయిదోసారి భారత కెప్టెన్ శుభమగన్ గిల్ నిలిచాడు. ఆసియా కప్, ఏషియన్ గేమ్స్‌లో రాణించిన మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నారు. 27 ఏళ్ల క్రికెటర్ గిల్ 2023 జనవరి, సెప్టెంబర్‌లో, 2025 ఫిబ్రవరి, జూలైలోనూ ఆ అవార్డు గెలుచుకున్నాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అయిదో సారి గెలుచుకోవడం అద్భుతంగా ఉందని, ఐసీసీ ప్యానల్ సభ్యులకు వందనాలు చెబుతున్నట్లు గిల్ పేర్కొన్నాడు. తిరువనంతపురంలో విండీస్‌తో జరిగిన తొలి వన్డేల్లో 110 రన్స్ చేయగా, రెండో వన్డేలో 223 రన్స్ చేశాడు. అలా రన్స్ స్కోరు చేయడం సంతోషంగా ఉందని, స్వంత అభిమానుల ముందు రాణించడం మరింత ఆనందాన్ని ఇస్తుందని గిల్ అన్నారు.
India batting superstar becomes the first-ever five-time ICC Men’s Player of the Month winner after a run-filled series against West Indies 🌟
Find out the winner ➡️ https://t.co/vfMePK59UQ https://t.co/LszB7cqD7C
— ICC (@ICC) October 13, 2026
మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ గత ఏడాది నవంబర్‌లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నది. వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆమె అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. భారత ఓపెనర్ ఇటీవల మ్యాచుల్లోనూ దూకుడుగా ఆడింది. ఆసియాకప్‌లో 360 రన్స్ స్కోరు చేసింది. ఆరు వికెట్లు కూడా తీసింది. ఇక ఏషియన్ గేమ్స్‌లో బంగ్లాపై సెంచరీ చేయగా, లంకతో ఫైనల్లో 48 రన్స్ స్కోరు చేసింది. మరోసారి ఐసీసీ అవార్డు గెలవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నది.
India batter’s exploits in the Women’s Asia Cup and the Asian Games reward her with September’s ICC Women’s Player of the Month award 🎖️
Find out the winner ➡️ https://t.co/ldxABLBp0I https://t.co/2bStmpL0Jj
— ICC (@ICC) October 13, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

