Shooting | సాయం చేస్తే సత్తాచాటుతా.. యువ షూటర్ ఆకాశ్ వేడుకోలు
హైదరాబాద్: అతడో యువ షూటర్. చెదరని గురితో లక్ష్యాన్ని చేధించడంలో దిట్ట. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటే నైజం. కానీ ఆర్థిక సమస్యలే అతడికి ప్రతిబంధకాలయ్యాయి. సత్తాచాటాలని ఉన్నా.. డబ్బుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సరిగ్గా మూడేండ్ల క్రితం షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న హైదరాబాద్‌కు చెందిన ఆకాశ్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతున్నది.
ఓవైపు కరోనా వైరస్ కారణంగా పలు టోర్నీలు రద్దు కావడం, వాయిదా పడటం అతడి కెరీర్‌పై ప్రభావం చూపించింది. అయితే గతేడాది గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీలో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బరిలోకి దిగిన ఆకాశ్ 21వ స్థానంలో నిలిచాడు. రైఫిల్ పోటీల్లో పాల్గొనేందుకు కావాల్సిన సరైన సూట్, గన్ లేకపోవడం తన ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోందని ఆకాశ్ వాపోతున్నాడు.
దాదాపు రూ.3 లక్షల విలువ చేసే వీటి కోసం అతడు దాతల సాయం కోసం చూస్తున్నాడు. ఎవరైనా ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్‌కోటిలోని ప్రగతి డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఆకాశ్.. గచ్చిబౌలి సాయ్ కేంద్రంలో కోచ్ సందీప్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

