Shoaib Malik | మూడో పెండ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. సానియాకు విడాకులు ఇచ్చాడా..?
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) ముచ్చటగా మూడో పెండ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మిర్జా(Sania Mirza)కు దూరంగా ఉంటున్న అతడు పాక్‌కు చెందిన నటి సనా జావెద్(Sana Javed)ను వివాహం చేసుకున్నాడు. తమ పెండ్లి వేడుక ఫొటోలను...
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) ముచ్చటగా మూడో పెండ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మిర్జా(Sania Mirza)కు దూరంగా ఉంటున్న అతడు.. పాక్‌కు చెందిన నటి సనా జావెద్(Sana Javed)ను వివాహం చేసుకున్నాడు. తమ పెండ్లి వేడుక ఫొటోలను షోయబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఆ ఫొటోలకు ‘అహ్మదుల్లా.. మేము ఒక్కటయ్యాం’ అని క్యాప్షన్ రాశాడు. ఆన్లైన్లో మాలిక్ పెండ్లి ఫొటోలు చూసిన అభిమానులు షాకవుతున్నారు.. భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియాకు మాలిక్ విడాకులు ఇచ్చాడా? లేదా? అని చర్చించుకుంటున్నారు. సానియా కంటే ముందు మాలిక్ హైదరాబాద్‌కే చెందిన అయేషా సిద్దిఖీ(Ayesha Siddiqui)కి 2002లో పెండ్లి చేసుకున్నాడు. అయితే.. 2010లో ఆమెతో వివాహ బంధానికి స్వస్తి పలికి సానియాను మనువాడాడు.
– Alhamdullilah ♥️
“And We created you in pairs” وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024
ఎవరీ సనా
సనా ఉర్దూ టీవీ సీరియల్ నటి. 2012లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సనా ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. సనాకు కూడా ఇది రెండో పెండ్లి. మొదట ఆమె పాక్ నటుడు, సింగర్ ఉమర్ జస్వాల్‌ను 2020లో పెండ్లి చేసుకుంది. అయితే.. మనస్ఫర్థల కారణంగా కొన్ని రోజులకే ఇద్దరూ విడిగా ఉండడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే సనా.. షోయబ్ మాలిక్‌కు దగ్గరైంది.
హైదరాబాద్‌లో ఘనంగా..
షోయెబ్ మాలిక్, సానియా మిర్జా వివాహం 2010లో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్లో వలీమా వేడుక జరిగింది. వీళ్లకు ఇజాన్(Izhaan) అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, గత కొంత కాలంగా సానియా, షోయబ్ వేరువేరుగా ఉంటున్నారు. దాంతో, వీళ్ల పన్నెండేళ్ల వివాహబంధం త్వరలోనే ముగియనుందనే వార్తలు వినిపించాయి. అయితే.. అధికారికంగా మాలిక్, సానియాలు ఎక్కడా తాము విడిపోతున్నామని వెల్లడించలేదు. అంతేకాదు.. వీళ్లిద్దరూ ది మీర్జా మాలిక్ షో లో కలిసి నటించారు.
షోయబ్ మాలిక్, సనా జావెద్, సానియా మిర్జా

సానియాతో విడాకుల ప్రస్తావన వచ్చిన సమయంలోనే పాక్‌కు చెందిన యూట్యూబర్, నటి అయేషా ఒమర్(Ayesha Omar)తో షోయబ్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. అందుకనే ఈ మాజీ ఆల్‌రౌండర్ సానియాతో డైవర్స్‌కు సిద్ధపడ్డాడనే గుసగుసలు వినిపించాయి. కానీ, అయేషా మాత్రం ఆ వార్తల్ని కొట్టిపారేసింది. తనకు షోయబ్ మంచి మిత్రుడని, అతను తన భార్య సానియాతో సంతోషంగా ఉన్నాడని ఆమె చెప్పింది.
ఇవి కూడా చదవండి
- Harmanpreet Kaur | హర్మన్‌ప్రీత్‌కు బాల రాముడి ‘ప్రాణ ప్రతష్ఠ’ ఆహ్వానం
- Ayodhya Ram Temple: పూల బొకేలతో కళకళలాడుతన్న అయోధ్య గుడి.. వీడియోలు
- Power Cut | హైదరాబాద్‌లో కరెంట్ కోతలు.. ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్ బంద్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

