అహ్మదాబాద్: ఐపీఎల్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వి షా ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలుసు కదా. కేవలం 41 బంతుల్లో 82 పరుగులు చేశాడతడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్ ఏంటంటే.. శివమ్ మావి వేసిన తొలి ఓవర్లోనే పృథ్వి ఆరు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మన్ అతడు. గతంలో రహానే ఈ ఘనత సాధించాడు.
అయితే మ్యాచ్ తర్వాత తన ఓవర్లో వీరబాదుడు బాదిన పృథ్వి షాపై ప్రతీకారం తీర్చుకున్నాడు శివమ్ మావి. సీరియస్‌గా కాదుగానీ.. నా ఓవర్లోనే ఆరు ఫోర్లు కొడతావా అంటూ పృథ్వి మెడను గట్టిగా పట్టుకున్నాడు మావి. ఈ వీడియోను ఐపీఎల్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. మ్యాచ్ ముగియగానే ఫ్రెండ్స్ అయిపోయారు అంటూ ఐపీఎల ఈ వీడియోను పోస్ట్ చేయడం విశేషం. ఇక పృథ్వి షా బాదిన ఆ ఆరు ఫోర్లను చూడాలనుకుంటే కింద ఉన్న ట్వీట్లోని లింక్‌పై క్లిక్ చేయండి.