ధోనీ, సీఎస్కే మధ్య వాటా వివాదం!
ఐపీఎల్లో అత్యంత ప్రజాకర్షణ కల్గిన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ వాటా కొనుగోలు చేస్తున్నాడా? కానీ మహీ డిమాండ్‌కు సీఎస్కే మేనేజ్మెంట్ ఒప్పుకోవడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ లీగ్ ఆరంభ సీజన్ నుంచి చెన్నైకి ఆడుతున్న మహీ.. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ. రికార్డు స్థాయిలో సూపర్‌కింగ్స్‌కు ఐదు ట్రోఫీలను అందించిన ఈ మాజీ కెప్టెన్.. జట్టులో తనకు వాటా కావాలని అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
- జట్టులో 25 శాతం వాటా కోరిన మహీ
- 5 శాతమే ఇస్తామంటున్న యాజమాన్యం?
చెన్నై: ఐపీఎల్లో అత్యంత ప్రజాకర్షణ కల్గిన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ వాటా కొనుగోలు చేస్తున్నాడా? కానీ మహీ డిమాండ్‌కు సీఎస్కే మేనేజ్మెంట్ ఒప్పుకోవడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ లీగ్ ఆరంభ సీజన్ నుంచి చెన్నైకి ఆడుతున్న మహీ.. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ. రికార్డు స్థాయిలో సూపర్‌కింగ్స్‌కు ఐదు ట్రోఫీలను అందించిన ఈ మాజీ కెప్టెన్.. జట్టులో తనకు వాటా కావాలని అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జాతీయ మీడియా కథనాల ప్రకారం ధోనీ.. సీఎస్కేలో 25 శాతం వాటా కావాలని కోరగా ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం 3 శాతమే ఇస్తానని చెప్పినట్టు తెలుస్తున్నది. దీంతో జార్ఖండ్ డైనమైట్ తన డిమాండ్‌ను 20 శాతానికి.. ఆ తర్వాత 18 శాతానికి తగ్గించుకున్నా చెన్నై మేనేజ్మెంట్ మాత్రం 5.5 శాతానికంటే ఎక్కువ ఇవ్వలేమని తెగేసి చెప్పినట్టు వినికిడి. సీఎస్కే ఓనర్లతో ధోనీకి ఆరంభం నుంచీ మంచి అనుబంధమే ఉంది. చెన్నై జట్టును ధోనీని విడదీసి చూడటం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య వాటాల వ్యవహారం ఎటు దారితీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

