Arjuna Award | అర్జున అవార్డు అందుకున్న ఇషా సింగ్, షమీ
Arjuna Award : ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన తెలంగాణ షూటర్ ఇషా సింగ్(Esha Singh), భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ప్రతిష్థాత్మక అర్జున అవార్డు(Arjuna Award) అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా వీళ్లిద్దరూ..
Arjuna Award : ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన తెలంగాణ షూటర్ ఇషా సింగ్(Esha Singh), భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ప్రతిష్థాత్మక అర్జున అవార్డు(Arjuna Award) అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా వీళ్లిద్దరూ ఈ అవార్డు స్వీకరించారు. భారత క్రీడా రంగంలో ఖేల్ రత్న(Khel Ratna) అవార్డు తర్వాత రెండో అత్యుత్తన్నత అవార్డు అందుకున్న షమీ తన కల నిజమైందని అన్నాడు.
‘నా కల నిజమైంది. జీవితంలో చాలామందికి ఈ అవార్డు గెలవడం సాధ్యం కాదు. ఈ అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని షమీ తెలిపాడు. 2023కు గానూ 26 మంది అర్జున అవార్డు స్వీకరించారు. వీళ్లలో ఆసియా గేమ్స్లో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్స్ ఎక్కువ మంది ఉండడం గమనార్హం.
అర్జున అవార్డు అందుకున్నది వీళ్లే
ఆర్చరీ – అదితి గోపిచంద్ స్వామి, ఒజాస్ ప్రవీణ్ డియోటలే.
అథ్లెటిక్స్ – పరుల్ చౌదరీ, శ్రీశంకర్ మురళి.
బాక్సింగ్ – మహ్మద్ హుసాముద్దీన్.
చెస్ – ఆర్ వైశాలి.
క్రికెట్ – మహ్మద్ షమీ.
ఈక్వెస్ట్రియన్ – అనుష్ అగర్వాల.
ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ – దివ్యక్రితి సింగ్.
గోల్ఫ్ – దిక్షా దగర్.

హాకీ – కృష్ణన్ బహూదర్ పాఠక్, పుఖ్రంబం సుహిలా చాను.
కబడ్డీ – పవన్ కుమార్, రీతు నేగీ.
ఖో ఖో – నస్రీన్.
లాన్ బౌల్స్ – పింకీ
షూటింగ్ – ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. ఈషా సింగ్
స్క్వాష్ – హరీందర్ పాల్ సింగ్ సాధు.

టేబుల్ టెన్నిస్ – ఆహికా పంగల్.
రెజ్లింగ్ – సునీల్ కుమార్, అంతిమ్ పంగల్.
వుషూ – నవోరెమ్ రోషిబిన దేవి.
పారా ఆర్చరీ – శీతల్ దేవి.
అంధుల క్రికెట్ – ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి.
పారా కనోయింగ్ – ప్రచీ యాదవ్
సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో అద్భుతంగా రాణించినందుకు షమీ పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. మోగా టోర్నీలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమీ 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. తన సూపర్ బౌలింగ్తో టీమిండియాను ఫైనల్కు చేర్చాడు. అయితే.. టైటిల్ పోరులో షమీ రెండు వికెట్లతో విజృంభించినా ట్రావిస్ హెడ్(137) సూపర్ సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు.
ఇవి కూడా చదవండి
- White House | అమెరికా అధ్యక్ష భవనం గేటుపైకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి అరెస్ట్
- ICC | ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో కమిన్స్.. మహిళల విభాగంలో ఇద్దరూ మనోళ్లే
- Cold Waves | గజగజ వణుకుతున్న ఉత్తరభారతం.. చలిమంటలతో ఉపశమనం పొందుతున్న ప్రజలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

