లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న హండ్రెడ్ బాల్ టోర్నీలో.. పాకిస్థాన్ స్పీడ్ బౌలర్ షాహీన్ అఫ్రిది(Shaheen Afridi) హడలెత్తించాడు. వెల్ష్ ఫైర్ జట్టు తరపున ఆడిన షాహీన్.. తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు జలక్ ఇచ్చాడు. వర్షం వల్ల మ్యాచ్‌ను 40 బంతులకు కుదిరించారు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 94 రన్స్ చేసింది. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన ఒరిజినల్స్ జట్టు 40 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి కేవలం 85 రన్స్ మాత్రమే చేయగలిగింది. షాహీన అఫ్రిది, డేవిడ్ విల్లేలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన షాహీన్ అఫ్రిదికి ఈ మ్యాచ్ ఓ మధుర స్మృతిగా మిగిలింది. షాహీన్ బౌలింగ్ వీడియో ఇదే.
This is @iShaheenAfridi, everyone 🦅 #TheHundred pic.twitter.com/NGhPJZ9QqX
— The Hundred (@thehundred) August 2, 2023
తొలి బంతికి ఫిలిప్ సాల్ట్‌ను ఔట్ చేశాడతను. షాహీన్ పేస్‌కు ఆ బ్యాటర్ తేలిపోయాడు. బంతి నేరుగా ప్యాడ్స్‌కు తగలడంతో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇక ఆ తర్వాత బంతికే లౌరీ ఇవాన్స్ కూడా ఎల్బీ అయ్యాడు. కానీ ఆ తర్వాత షాహీన్ పెద్దగా రాణించలేకపోయాడు. 10 బంతుల్లో అతను 24 రన్స్ సమర్పించుకున్నాడు. వెల్ష్ ఫైర్ జట్టు బ్యాటర్ లూక్ వెల్స్ 23 బంతుల్లో 57 రన్స్ స్కోర్ చేశాడు.